ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా నేతల అరెస్టులకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన - ఉదయగిరిలో తెదేపా కొవ్వొత్తుల ప్రదర్శన వార్తలు

తెదేపా నేతల అరెస్టులకు నిరసనగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ తెదేపా నాయకులు విమర్శించారు. త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

tdp leaders protest with candles in udayagiri nellore district
తెదేపా నేతల అరెస్టులకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

By

Published : Jun 14, 2020, 7:48 PM IST

తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్​రెడ్డి, చింతమనేని ప్రభాకర్ అరెస్టులను నిరసిస్తూ.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తేదేపా నాయకులు నిరసన తెలిపారు. పంచాయతీ బస్టాండ్ కూడలిలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికార అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెదేపా నాయకులను అరెస్టు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఎదిరించే వారు ఉండకూడదనే దురుద్దేశంతోనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారన్నారు. ఎన్నో అక్రమాలు చేసిన వైకాపా నాయకులు కళ్లెదుటే కనిపిస్తున్నా.. వారిని మాత్రం ఏంచేయడం లేదన్నారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ABOUT THE AUTHOR

...view details