మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి సందర్భంగా... నెల్లూరులో ఆయన విగ్రహానికి తెదేపా నేతలు నివాళులు అర్పించారు. అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని నర్తకి సెంటర్ దగ్గరున్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పూలమాల వేశారు. ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు.
నెల్లూరులో ఎన్టీఆర్కు తెదేపా నేతల నివాళి - నెల్లూరులో ఎన్టీఆర్కు తెదేపా నేతలు నివాళులు..
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా.. తెదేపా నేతలు ఆయన విగ్రహానికి నెల్లూరులో నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పూలమాల వేశారు.
నెల్లూరులో ఎన్టీఆర్కు తెదేపా నేతలు నివాళులు
TAGGED:
Ntr Vardhanthi