నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెరువులో దంపతులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన దంపతులు వంగవరగు నారాయణ రెడ్డి (60), స్వర్ణమ్మ (58)గా పోలీసులు గుర్తించారు. స్కూటీ అదుపు తప్పి కింద పడిపోగానే స్కూటీపై వెనుక భాగంలో ఉన్న స్వర్ణమ్మ చెరువులో పడిపోయింది. భార్యను కాపాడేందుకు ఈత రాకపోయినా భర్త ప్రయత్నించి విగతజీవిగా మారారు. తెల్లవారుజామున రేవూరులోని తన స్వగృహం నుంచి నెల్లూరుకు స్కూటీపై బయలుదేరిన దంపతులు.. చెరువు కట్టపై పంది అడ్డం రావడంతో అదుపుతప్పి చెరువులో పడిపోయారు. ఉదయం 4:30 గంటలకు నారాయణరెడ్డి తన బంధువులకు ఫోన్ చేసి చెప్పారని.. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో తూములో దంపతులు పడి పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే నారాయణరెడ్డి సమాచారం ఇచ్చినా కాపాడలేకపోయామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి దంపతులు మృతి - ఆత్మకూరులో దంపతులు మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి దంపతులు మృతి చెందిన ఘటన ఆత్మకూరులో జరిగింది. స్కూటీ పై వెళుతున్న వీరికి చెరువు కట్టపై పంది అడ్డం రావడంతో అదుపుతప్పి చెరువులో పడిపోయారు. భార్య ముందు చెరువులో పడిపోవడంతో... భర్త ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి విగతజీవిగా మారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
suicide attempt