నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బూదవాడకు చెందిన సన్నపురెడ్డి మహేష్ స్థానిక జడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో తన సోదరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపం చెందిన మహేష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైద్యం నిమిత్తం మహేష్‌ను ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మహేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఆడుకుంటూ సోదరితో ఘర్షణ..ఉరేసుకుని సోదరుడు ఆత్మహత్య - udayagiri govt hospital
నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. మనస్తాపంతో ఎనిమిదో తరగతి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది.
నెల్లూరు జిల్లా బూదవాడలో ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య