ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసాయనాల పిచికారీతో కరోనా కట్టడికి చర్యలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి జిల్లా యంత్రాంగం వైరస్ నియంత్రణకు ముమ్ముర ఏర్పాట్లు చేస్తోంది. లాక్​డౌన్ ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. దోమల నివారణకు మందులు చల్లిస్తున్నారు. సోడియం హైపో క్లోరైడ్, క్రిమి సంహారక మందు, పసుపు నీళ్లను.. అగ్నిమాపక యంత్రంతో స్ప్రే చేస్తున్నారు.

Spray of chemicals in various ways in state
వివిధ పద్ధతులలో రసాయనాల పిచికారి

By

Published : Apr 2, 2020, 4:55 PM IST

హిందూపురంలో..

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో కరోనా రెండు పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. హిందూపురం పట్టణంలో భాజాపా నేతల ఆధ్వర్యంలో క్రిమి సంహారక మందును పిచికారీ చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలని ఎంపీ గోరంట్ల మాధవ్ ను కోరారు. నిత్యావసరాల కొరకు బయటకు వచ్చే సమయంలో సామాజిక దూరం పాటించాలని సూచించారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో..

అనకాపల్లిలో ...

కరోనా నివారణ చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి వీధుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. అగ్నిమాపక సిబ్బంది వాహనంతో అనకాపల్లి గాంధీనగరం, అంజయ్య కాలనీగవరపాలెం దాసరి గెడ్డ రోడ్, ప్రాంతంలో పిచికారీ చేశారు.

చోడవరంలో..

నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ఫాగ్ మిషన్​తో దోమల నివారణ మందు స్ప్రే చేశారు. రహదారుల వెంబడి బ్లీచింగ్ చల్లారు. సంచార వాహనాల్లో కూరగాయల అమ్మకాలు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో..

యర్రగొండపాలెంలో...

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పసుపు, బ్లీచింగ్ తో కలిపిన ద్రవాన్ని అగ్నిమాపక యంత్రంతో స్ప్రే చేశారు. పట్టణ ప్రధానవీధుల గుండా పిచికారి చేశారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో..

బుచ్చిరెడ్డిపాలెంలో...

కరోనా వైరస్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మండలానికి చెందిన ఓ మహిళకు కొవిడ్ -19 పాజిటివ్ అని తేలడంపై ఆ గ్రామాన్ని హైరిస్క్ జోన్ గా అధికారులు ప్రకటించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, వైరస్ నిర్మూలనకు ద్రావణాన్ని చల్లించారు. కోవిడ్-19పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరో పక్క వైరస్ ప్రబలకుండా జొన్నవాడ గ్రామంలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో ధన్వంతరి సహిత మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. మానవాళి ఆరోగ్యం, లోకకళ్యాణం కోసం ఈ హోమం నిర్వహించినట్లు ఆలయ పాలకులు, అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లా కంకణాలపల్లిలో...

కంకణాలపల్లిలో ...

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు గుంటూరు జిల్లాలోని ఓ గ్రామస్థులు వినూత్న ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి పంచాయతి పరిధిలోని వావిలాల నగర్​లో 300 కుటుంబాలు ఉన్నాయి. వీరంతా తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చిన వారే. కరోనా వైరస్ ను తమ గ్రామంలోకి రాకుండా చేసేందుకు వీరు కషాయాలను తయారు తయారుచేశారు. వేపాకు, వాము ఆకు, గన్నేరు ఆకు, పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని గ్రామంలో చల్లుతున్నారు. దగ్గుకు వాము , ఆస్తమాకు గన్నేరు, వేపాకు, పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తాయని చెప్పారు. వారంలో ఒక్కసారి ఈ ద్రావణాన్ని గ్రామమంతా పిచికారి చేస్తున్నామని ప్రజలు తెలిపారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో మరో 21 మందికి కరోనా​.. 132కు చేరిన పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details