కరోనా ప్రభావంతో.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను మూసేసిన ప్రభుత్వం ఉన్నతపాఠశాలలు మాత్రం నిర్వహిస్తోంది. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో.. తరగతులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని 831ఉన్నత పాఠశాల్లో.. 80వేల మంది పదో తరగతి చదువుతున్నారు. జూన్‌లో జరిగే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నూటికి 20 శాతం విద్యార్థులే తరగతులకు హాజరవుతున్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్డులోని (డీసీఆర్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఈటీవీ బృదం సందర్శించింది.
పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే.. - పదో తరగతి పరీక్షలపై విద్యార్థుల అభిప్రాయం
ఓ వైపు కరోనా తరుముతోంది! పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని విపక్షాలు అంటుంటే..జరిపి తీరుతామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అధికార, విపక్షాల మాట ఎలా ఉన్నా.. అసలు పరీక్షలు రాయాల్సిన పిల్లల మదిలో ఏముంది.? ప్రస్తుతం పాఠశాలకు ఎంత మంది వస్తున్నారు? ఉపాధ్యాయులు సిలబస్ మొత్తం చెప్పేశారా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు.. నెల్లూరు (డీసీఆర్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించింది ఈటీవీ భారత్.
students opinion
అక్కడ పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు.. కరోనాబారిన పడటంతో పాఠశాలకు బిక్కుబిక్కుమంటూనే వస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినా.. రాష్ట్రంలో పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై.. విద్యార్థుల్లో ఆందోళన కనిపిస్తోంది.
ఇదీ చదవండీ..రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు