ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వృథాగా పోయే నీటిని రాయలసీమకు వినియోగిస్తే తప్పేంటి? '

సముద్రానికి పోయే నీటిని రాయలసీమకు మళ్లీస్తే తప్పేంటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. కరవు ప్రాంతమైన రాయలసీమకు కనీసం ఒక్క పంటకైనా నీరు ఇవ్వాలని కోరారు. పెన్నా నీరు కూడా కలుపుకొని కృష్ణా నికర జలాల్లో రాయలసీమకు తొలిపంట నీరివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Aug 20, 2020, 9:55 PM IST

సముద్రానికి పోయే నీరు రాయలసీమలో పంట పండించేందుకు వినియోగిస్తే తప్పేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. నికరజలాలను ఒక పంట కోసమైనా రాయలసీమ రైతులు వాడుకునే అవకాశం కల్పించకపోవటం సబబు కాదన్నారు.

రాయలసీమ పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని చెప్పారు. దేశంలోనే రాయలసీమ అత్యంత దుర్భిక్ష ప్రాంతమన్న సోమిరెడ్డి... పెన్నా నీరు కూడా కలుపుకుని కృష్ణా నికర జలాల్లో రాయలసీమ మొదటి పంటకు నీరివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details