ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Somireddy On Dot Lands: జగన్ రెడ్డి చెప్పే ప్రతి స్కీం వెనక.. ఒక స్కాం: సోమిరెడ్డి

Somireddy On Dot Lands: జగన్ చెప్పే ప్రతి స్కీం వెనక ఒక స్కాం ఉందన్నది జగమెరిగన సత్యం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చుక్కల భూముల పరిష్కారం వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

Somireddy
Somireddy

By

Published : May 12, 2023, 8:26 PM IST

Somireddy On Dot Lands:చుక్కల భూముల పరిష్కారం వెనుక భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్ రెడ్డి చెప్పే ప్రతి స్కీం వెనుక ఒక స్కాం దాగి ఉందని ధ్వజమెత్తారు. చుక్కల భూముల కుంభకోణం విలువ లక్ష కోట్లా లేక అంతకు రెట్టింపా అన్నది లోతైన విచారణ జరిపితే తప్ప బయట పడదని పేర్కొన్నారు. జిల్లా జడ్జి పర్యేవేక్షణలోనే నిషేధిత భూములకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు తాత్సారం చేసి ఎన్నికల ఏడాదిలో జగన్ చుక్కల భూములు, నిషేధిత భూముల విముక్తి పేరిట హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఇది చిత్తశుద్ధితో, ప్రజల సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నం కాదని దుయ్యబట్టారు.

భారీ కుట్ర:చుక్కల భూమి విముక్తి పేరుతో దేవాదాయ శాఖతో సహా వివిధ ప్రభుత్వ భూములను అక్రమంగా స్వంతం చేసుకోవడానికి జరుపుతున్న భారీ కుట్ర అని మండిపడ్డారు. ఎవరి నుంచి దరఖాస్తులు రాకున్నప్పటికీ, సుమోటోగా అధికారులతో వెరిఫికేషన్ చేయించి, వేలాది ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తప్పిస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని ముఠాలు నిషేధిత జాబితాను భూస్వాహాకు మార్గంగా వాడుకొంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాట వినని, తాము అడిగిన చవక ధరకు భూములు అమ్మని వారిని, నిషేధిత జాబితాలో చేర్చేశామని బెదిరించిన సంఘటనలు కోకోల్లలు ఉన్నాయని తెలిపారు.

చుక్కల భూముల సమస్యను పరిష్కరించాం:దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని సీఎం జగన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన కార్యక్రమంలో చుక్కల భూముల రైతులకు హక్కు పత్రాలను సీఎం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో భూసర్వే చేయిస్తున్నామని.. 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీని వేగవంతం చేశామని చెప్పారు. రూ.20వేల కోట్ల విలువైన చుక్కల భూములకు సంపూర్ణ హక్కు కల్పిస్తున్నట్లు జగన్‌ వివరించారు. సుమారు 7 లక్షలకుపైగా భూహక్కు పత్రాలను అన్ని రకాలుగా అప్‌డేట్‌ చేసి రైతులకు అందించామని తెలిపారు.

ప్రతిపక్ష నేతల నాటకాలు నమ్మొద్దు..:రాష్ట్రంలోని రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అన్ని గ్రామాల్లో సర్వే చేసి సహరిద్దు రాళ్లు వేస్తున్నాం. లంచాల ప్రస్తావన లేకుండానే మీ ఖాతాల్లో నగదు పడుతోంది. ఇవాళ 97,471 మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22-ఎ తొలగించాం. రికార్డుల్లో మార్పు చేశాం. మాది రైతు ప్రభుత్వం.. వారికి మంచి చేయడమే మా విధానం. భవిష్యత్తులో వివాదాలు రాకుండా భూహక్కు పత్రాలు ఇస్తున్నాం. ప్రతిపక్ష నేతల నాటకాలు నమ్మొద్దని రైతులను కోరుతున్నా’’ అని జగన్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details