సోమశిల జలాశయం పూర్తిగా నిండిందని సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారావు తెలిపారు. గడిచిన మూడు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లక్ష క్యూసెక్కులు నీరు రావడంతో 12 గేట్లు ఎత్తి లక్షా 30 వేల క్యూసెక్కులు పెన్నా నదికి విడుదల చేశామని, దీంతో సముద్రంలోకి 40 టీఎంసీల నీరు వృథాగా పోయిందన్నారు.
పూర్తిగా నిండిన సోమశిల జలాశయం..12 గేట్లు ఎత్తివేత - somasila reservoire superintendent latest comments
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయం పూర్తిగా నిండిందని ఇంజనీర్ కృష్ణారావు అన్నారు. దీంతో జలాశయం ఆయకట్టు రైతులకు సాగునీరు పుష్కలంగా అందించనున్నట్లు పేర్కొన్నారు.
సోమశిల జలాశయం
ప్రస్తుతం జలాశయంలోకి 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 36 వేల క్యూసెక్కులు పెన్నానదికి విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. కండలేరు జలాశయానికి పదివేల క్యూసెక్కులు నీరు వస్తుందని.. ఈ జలాశయం కింద ఆయకట్టు రైతులకు కూడా సమృద్ధిగా నీరు ఇస్తామన్నారు.
ఇవీ చూడండి...
అధికారుల నిర్లక్ష్యం ప్రాణం మీదకు తెచ్చింది
TAGGED:
సోమశిల జలాశయం తాజా వార్తలు