ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం ప్రాణం మీదకు తెచ్చింది - సోమశిల జలాశయం తాజా వార్తలు

సోమశిల జలాశయానికి వరద నీరు భారీగా వచ్చిచేరుతోంది. దీంతో పెన్నా డెల్టాకు ఆదివారం నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తే ముందు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీచేయలేదు. దీంతో జలాశయం సందర్శనానికి వచ్చిన ముగ్గురు యువకులకు మృత్యుమొహంలోకి వెళ్లి వచ్చారు.

somasila dam water flow
somasila dam water flow

By

Published : Sep 21, 2020, 2:57 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో పెన్నా డెల్టాకు ఆదివారం నాడు 11 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదు. జలాశయ సందర్శనానికి వచ్చిన ప్రజలను గాలికొదిలేశారు. దీంతో జలాశయం ఆపరాన్ ప్రాంతం వద్ద ముగ్గురు యువకులు హల్​చల్ చేశారు. అయితే ఆ ముగ్గురు యువకులు మద్యం సేవించినట్లుగా తెలుస్తుంది. పోలీసుల ఎదుట ఈ సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. పెను ప్రమాదం నుంచి యువకులు బయటపడడంతో అక్కడున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యవైఖరిపై సందర్శకులు మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details