ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ఉద్ధృతితో కోతకు గురైన పోర్లుకట్ట - పోర్లుకట్ట

నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురవడంతో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. నీటి ప్రవాహం పెరగడంతో దిగువకు నీళ్లు వదులుతున్నారు. అయితే పోర్లుకట్ట కోతకు గురవడంతో ఆ వైపున ఉన్న ఐదు గేట్లను మూసివేశారు.

somasila dam  gates damaged due to flood at nellore
వరద ఉద్ధృతి వల్ల కోతకు గురైన సోమాశిల జలాశయం గేట్లు

By

Published : Sep 22, 2020, 8:48 PM IST

Updated : Sep 22, 2020, 8:56 PM IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. లక్ష క్యూసెక్కులపైన వరద ప్రవాహం వస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం 78 టీఎంసీలకు చేరుకుంది. దీనితో మొత్తం 11 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహానికి జలాశయం ఎడమవైపున ఉన్న పోర్లుకట్ట కోతకు గురైంది. అప్రమత్తమైన అధికారులు కోతకు గురైనవైపు ఉన్న 5 గేట్లు మూసేసి... మిగతా 6గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగి ఉంటే.. పోర్లుకట్ట పూర్తిగా తెగి భారీ ప్రమాదం జరిగేదని స్దానికులు తెలిపారు.

Last Updated : Sep 22, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details