నెల్లూరు జిల్లా కోవూరులో వెంకటేశ్వర్లు అనే ఓ వృద్దుడు.. బయట ఆడుకుంటున్న చిన్నారిని టీవీ చూసేందుకు ఇంట్లోకి రమ్మని పిలిచాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆ సమయంలో మరో బాలిక అక్కడికి రావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కోవూరు, నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వారు వృద్దుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన వృద్ధుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అయిదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం - rape attempt on a girl child in kovuru
అరవై ఐదేళ్ల వృద్దుడు, అభం శుభం తెలియని అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ దారుణం వెలుగుచూసింది.
attempted to rape