ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

31 కేజీల వెండితో దొరికిన బొకారో దొంగలు - express

గతేడాది నవంబర్​లో బొకారో ఎక్స్​ప్రెస్​​లో చోరీ కలకలం రేపింది. వెండి ఆభరణాల అపహరణ కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

"బొకారో" దొంగలు దొరికారు...

By

Published : May 8, 2019, 3:20 PM IST

గత సంవత్సరం నవంబర్ 23న బొకారో ఎక్స్​ప్రెస్​​లో వెండి అపహరణ కేసులో నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రైల్వే పోలీస్ స్టేషన్లో నెల్లూరు రైల్వే డీఎస్పీ వసంత్ కుమార్ విలేకరులకు వివరాలు వివరించారు. చెన్నై జీఆర్టీ బంగారు నగల దుకాణం నుంచి తెనాలి విగ్నేశ్వర సిల్వర్ షాప్​లో వెండి అందించేందుకు వెంకటేష్ బయలు దేరాడు. ట్రైన్​లో వెళుతుండగా చినగంజాం వద్ద నిందితులు వెండి ఆభరణాలు దొంగలించారు. వేకువజాము సమయంలో వెంకటేష్ నిద్రలో ఉండగా దొంగలు బ్యాగ్ తీసుకొని పరారయ్యారు. ప్రధాన నిందితుడు గోపీచంద్​తోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. గోపీచంద్.. వెంకటేశ్​కి స్వయానా సోదరుడు. గతంలో ఇదే పని చేసిన గోపీచంద్ తప్పుడు ప్రవర్తన వల్ల బంగారు దుకాణం యజమానులు పనిలో నుంచి తీసేశారు. దీంతో నిందితుడు ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితుల వద్ద నుంచి 11 లక్షల రూపాయలు విలువచేసే 31 కేజీ 48 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలతో వెండిని తీసుకెళ్లడం వల్ల ఇటువంటి సంఘటనలు జరిగితే.. బాధితులు తిరిగి పొందొచ్చని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించిన పోలీసులకు డీఎస్పీ నగదు బహుమతి అందజేశారు.

"బొకారో" దొంగలు దొరికారు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details