ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటవీశాఖ భూమి అంటూ.. రొయ్యల గుంటలు పూడ్చివేత - nellore

నెల్లూరు జిల్లా కొత్తపల్లిలోని అటవీశాఖ భూమి అంటూ రొయ్యలగుంటలను ఆ శాఖాధికారులు పూడ్చివేశారు. కనీసం పది రోజుల గడువు కూడా ఇవ్వకుండా మొత్తం గుంటలన్నీ కూల్చేయడంతో 90 లక్షల రూపాయలు నష్టపోయానని బాధితుడు వాపోతున్నాడు.

రొయ్యలగుంటలు కూల్చివేత

By

Published : Jul 16, 2019, 12:49 PM IST

రొయ్యలగుంటలు కూల్చివేత

నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కొత్తపల్లి గ్రామంలో రొయ్యల గుంటలను అటవీశాఖా అధికారులు పూడ్చివేశారు. కొత్తపల్లి గ్రామస్తులు గ్రామకంఠం కింద ఉన్న 16 ఎకరాల భూమిని నెల్లూరు నగరానికి చెందిన మునిరత్నంనాయుడు అనే రైతుకు లీజుకిచ్చారు. పొలం లీజుకిచ్చే రోజు అగ్రిమెంట్​లో గ్రామకంఠం అనే రాసిచ్చారు. కానీ.. ఇప్పుడు ఈ భూమి అటవీశాఖ కిందకు వస్తుందని చెప్పి మొత్తం రొయ్యల గంటలను కూల్చేస్తున్నారు. కనీసం పది రోజులు టైం కూడా ఇవ్వకుండా కూల్చివేయడంతో.. 90 లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. దీనిపై తెలుగుదేశం పార్టీ, వైకాపా నాయకుల మధ్య వివాదం కొనసాగుతుందని మునిరత్నంనాయుడు ఆరోపిస్తున్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details