Student Suicide due to Ragging: ర్యాగింగ్‌ను అరికట్టడానికి ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. వాటి బారిన పడుతున్న విద్యార్థులు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ర్యాగింగ్‌కు మరో ఇంజనీరింగ్ విద్యార్థి బలి అయ్యాడు. కొద్ది రోజుల క్రితం తల్లితండ్రులకు కూడా ర్యాగింగ్ గురించి చెప్పాడు. నిత్యం వేదిస్తున్నారని చెప్పి వాపోయాడు.
కానీ ఇంతలోనే తన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతాడని వారు అనుకోలేదు. దీంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. తమ కుమారుడు మంచిగా చదువుకుని ప్రయోజకుడవుతాడని అనుకున్నారు. కానీ ఇలా విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అసలేం జరిగిందంటే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామంలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రదీప్ చదువుతున్నాడు. ప్రదీప్ తల్లిదండ్రులు పెంచలయ్య, లక్ష్మీలు అనంతసాగర్ మండలంలోని శంకర్ నగర్ గ్రామంలో ఉంటున్నారు. ప్రదీప్ తండ్రి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.