తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బంది నెల్లూరులో ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి గేటు ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. రూ.16వేలు వేతనాలు అందించేలా ప్రభుత్వం జీవో జారీ చేసినా.. తమకు మాత్రం రూ.7వేలు ఇస్తున్నారని.. ఆ డబ్బులు కూడ సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ప్రస్తుతం తాము ఇంటి అద్దెలు కూడ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. అధికారులు తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోమని తెలిపారు.
వేతనాలు చెల్లించాలని నెల్లూరు ప్రభుత్వాసుపత్రి పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన
తమకు చెల్లించాల్సిన వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వాసుపత్రి పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వేతనాలు చెల్లించాలని నెల్లూరు ప్రభుత్వాసుపత్రి పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళన
ఇదీ చదవండి:విశాఖ అభివృద్ధిపై పుస్తకం రూపొందించిన భాజపా