నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణం సమీపంలోని అటవీ శాఖ ప్లాంటేషన్ నుంచి అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పది ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఉదయగిరి రేంజ్ కార్యాలయానికి తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం - నెల్లూరు జిల్లా వింజమూరులో ఎర్రచందనం స్వాధీనం
ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను అక్రమంగా తరలిస్తున్న మూఠాను రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న అటవీ అధికారులు గమనించారు. వెంటనే దుండగులను పట్టుకునేందుకు అప్రమత్తమయ్యారు. అయినా నిందితులు పరారయ్యారు. 10 దుంగలను స్వాధీనం చేసుకుని ఉదయగిరికి తరలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి పరారైనవారిని అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు.
రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వింజమూరు పట్టణానికి సమీపంలో ఉండే తెలుగు గంగ ప్రత్యామ్నాయ నవీకరణ అటవీశాఖ ప్లాంటేషన్లో వెలుతురు కనిపించిందని రేంజ్ అధికారి ఉమా మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అనుమానంతో సిబ్బంది అక్కడికి చేరుకోగా..ఎర్రచందనం దుంగలను నరుకుతున్న నలుగురు ద్విచక్ర వాహనంపై పారిపోయారని వివరించారు. పారిపోయిన వ్యక్తుల్లో ఒకరిని గుర్తించామని అన్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఎర్రచందనం చెట్లను నరికిన వ్యక్తులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
TAGGED:
nellore news