ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

pslv C-52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి52... - PSLV-C52 launched at sriharikota

pslv c-52: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం మొదటి ప్రయోగవేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 (పీఎస్‌ఎల్‌వీ-సి52) నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లింది.

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి52
నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సి52

By

Published : Feb 14, 2022, 4:59 AM IST

Updated : Feb 14, 2022, 6:21 AM IST

pslv c-52:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రయోగాన్ని పూర్తి చేసింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం మొదటి ప్రయోగవేదిక నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 (పీఎస్‌ఎల్‌వీ-సి52) నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఆదివారం వేకువజామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇది 25.30 గంటలు కొనసాగిన తర్వాత రాకెట్‌ నింగిలోకి వెళ్లింది. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇది. వాహకనౌక బయలుదేరినప్పటి నుంచి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు 18.31 నిమిషాల సమయం పడుతుంది. వాహకనౌక 1710 కిలోల బరువు గల ఆర్‌ఐశాట్‌(ఈవోఎస్‌-04), 17.5 కిలోల ఐఎన్‌ఎస్‌-2టీడీ, 8.1 కిలోల ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది.

ఆర్‌ఐశాట్‌-1: ఈ ఉపగ్రహం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. దీని కాలపరిమితి పదేళ్లు. రేయింబవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలు ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారం కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ఇమేజింగ్‌ డేటా ఉపయోగపడనుంది.

ఐఎన్‌ఎస్‌-2టీడీ:భారత్‌, భూటాన్‌ కలిసి రూపొందించిన ఈ ఉపగ్రహ జీవితకాలం ఆరు నెలలు. భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్‌ కోసం రూపొందించారు.

ఇన్‌స్పైర్‌శాట్‌-1:విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారుచేసిన ఈ ఉపగ్రహం బరువు 8.1 కిలోలు. జీవితకాలం ఏడాది. తక్కువ భూకక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి అయానోస్పియర్‌ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్‌ అయానోస్పియర్‌ ప్రోబ్‌ అమర్చి ఉంటుంది.

ఇదీ చదవండి:5జీ దిశగా అడుగులు.. మే నెలలో వేలం షురూ..!

Last Updated : Feb 14, 2022, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details