'మన ఆత్మకూరు-మన అభివృద్ధి' నినాదంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆత్మకూరు, చేజెర్ల, సంగం మండలాల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలు ప్రారంభించారు. నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ.. ఆత్మకూరును జిల్లాగా ప్రకటిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలంటూ జనసేన నేతల రిలే దీక్షలు
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించారు. ఆత్మకూరును జిల్లాను చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఆత్మకూరును జిల్లాగా ప్రకటించాలని కోరుతూ రిలే దీక్షలు