నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్లో ఈ నెల ఆరో తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చోరీ సొమ్ము పంపకాల్లో తేడా రావడంతో పవన్ కుమార్ అనే దొంగను అతని స్నేహితులే హత్య చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంకయ్య, శ్రావణ్, విష్ణువర్ధన్లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన కత్తి, మోటార్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత కక్షలతోనే పవన్ కుమార్‌ను నిందితులు హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నిందితులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామన్నారు.
ఎన్టీఆర్ నగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు - nellore district updates
నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చోరీ సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాతోనే పవన్ కుమార్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ నగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు