ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Online Shopping Fraud: ఆన్​లైన్​లో యువకుడి షాపింగ్​.. ఇంటికి లక్కీ డ్రా పత్రాలు.. కట్​చేస్తే..!

Online Shopping Fraud: సైబర్​ నేరగాళ్ల మోసాలు ఎక్కువవుతున్నాయి కానీ తగ్గడం లేదు. అమాయకులను టార్గెట్​ చేసి వారి లక్షలు దండుకుంటున్నారు. మీకు లక్షల రూపాయలు లక్కీ డ్రాలో వచ్చాయని.. సింపుల్​గా కొంత అమౌంట్​ కడితే డబ్బులు మీ సొంతం అన్నట్లు నమ్మబలికి.. చివరకు నట్టేట ముంచుతారు. ఎన్నిసార్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్​ పోలీసులు చెప్పినా మాట వినని వారు.. సైబర్​ మోసాగాళ్ల చేతిలో చిక్కి విలవిలలాడుతున్నారు.

Online Shopping Frauad:
Online Shopping Frauad

By

Published : Jul 13, 2023, 10:01 AM IST

Online Shopping Fraud: ఆన్​లైన్ షాపింగ్.. లక్కీ డ్రా లో 11 లక్షల రూపాయలు వచ్చాయంటూ సందేశం.. కట్ చేస్తే ఆరు లక్షలు పోగొట్టుకున్న ఓ యువకుడు. సైబర్​ మోసాలపై ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఈజీగా వచ్చే డబ్బులను వదులుకోలేని కొందరు..సైబర్​ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుతున్నారు. అలా చిక్కి లక్షల రూపాయలను పొగొట్టుకొని కన్నీరుమున్నీరవుతున్నాకు. తాజాగా నెల్లూరులో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే.

నెల్లూరు జిల్లాకు ఓ యువకుడు ఆరు లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో నివాసముంటున్న సాయి లోకేశ్​. మీషో యాప్​లో ఆన్​లైన్​ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మీషో పేరుతో లక్కీ డ్రాలో 11 లక్షల రూపాయలు వచ్చాయంటూ, వాటికి సంబంధించిన పత్రాలు పోస్టల్ ద్వారా లోకేశ్​ ఇంటికి వచ్చాయి. జూన్​లో వచ్చిన ఈ పత్రాలను చూసి అందులోని నెంబర్​కు లోకేష్ ఫోన్ చేశాడు. 11 లక్షల రూపాయలు మీ అకౌంట్​లో జమ కావాలంటే టీడీఎస్ కింద కొంత నగదు కట్టాలంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. ఆ తర్వాత మీ అమౌంట్ రెట్టింపు అయ్యిందని.. దీనికి సంబంధించిన ఆర్​బీఐకి కొంత మొత్తం చెల్లించాలనడంతో వారు అడిగిన సొమ్మును విడతల వారీగా జమ చేస్తూ వచ్చారు. ఇలా దాదాపు ఒకటి కాదు రెండు కాదు.. సుమారు ఆరు లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు జమకాకపోవడంతో మోసపోయినట్లు లోకేశ్​ గ్రహించాడు. సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. లోన్ తీసుకుని ఆరు లక్షలు కట్టానని, పోలీసులు విచారించి తనకు న్యాయం చెయ్యాలని బాధితుడు సాయి లోకేశ్​ కోరుతున్నారు.

"నాకు మీషో అనే యాప్​ ద్వారా కొన్ని పత్రాలు.. ఇండియన్​ పోస్టల్​ ద్వారా వచ్చాయి. వాటిల్లో ఉన్న టర్స్మ్​ అండ్​ కండిషన్స్​ చదివి వాళ్లకు కాల్​ చేశాను. ఫొటోలు పెట్టమంటే పెట్టాను. టీడీఎస్​ అమౌంట్​ కట్టమన్నారు. ఆ తర్వాత ఆర్టీజీఎస్​ ద్వారా డబ్బులు పడినట్లు మెసేజ్​ పంపించారు. తర్వాత లక్ష కట్టమంటే కట్టాను. డబ్బులు డబుల్​ అయనట్లు చెప్పి మరో లక్షా 53వేలు కట్టించుకున్నారు. ఈ విధంగా నేను ఆరు లక్షలు డబ్బులు కట్టి మోసపోయాను. ఆ డబ్బును బయట వడ్డీకి తీసుకొచ్చి కట్టాను. నాకు ఎలాగైనా న్యాయం చేయండి."-సాయి లోకేశ్​, బాధితుడు

సైబర్​ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న మహిళ:సైబర్​ నేరగాళ్ల చేతిలో సాయిలోకేశ్​ మోసపోగా.. మరో మహిళ మాత్రం వాళ్లు ఉచ్చులో పడకుండా తప్పించుకుంది.నగరానికి చెందిన ఓ మహిళకు 13.50 లక్షలు వచ్చాయంటూ స్క్రాచ్ కార్డు పంపి, వివరాలు అందజేయాలని కోరారు. ఇదంతా మోసమని గ్రహించిన ఆ మహిళ సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకుంది.

"మీషో నుంచి నాక్కూడా స్క్రాచ్​ కార్డులు, కూపన్లు వచ్చాయి. ఫిబ్రవరిలో ఇవి వచ్చాయి. నేను వీటి గురించి తెలిసినవాళ్లందరిని సంప్రదించాను. వాళ్లంతా ఇది సైబర్​ క్రైం వాళ్లు పంపిస్తారని చెప్పారు. అందువల్ల నేను దీనిని లైట్​ తీసుకున్నాను."-నాగలక్ష్మి, నెల్లూరు

ABOUT THE AUTHOR

...view details