Old Age Woman's Suicide Attempt at Nellore District: కుటుంబానికి భారమయ్యామని భావించిన ఆ వృద్ధులు.. చెరువులో దూకేందుకు ప్రయత్నించారు. అంతలో అటుగా వచ్చిన గెదేల కాపరి వాళ్లను ఆపాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంగం చెక్ పోస్టు సెంటర్ సమీపంలోని ఎర్ర చెరువు వద్ద జరిగింది.
మర్రిపాడు మండలం భూదవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ద మహిళలు.. సంగం చెక్ పోస్టు సెంటర్ సమీపంలోని ఎర్ర చెరువులో దూకేందుకు ప్రయత్నించారు. ఆదే సమయంలో అటుగా వెళ్తున్న గేదెల కాపరి నరసింహులు.. గమనించి వారిని అడ్డుకున్నాడు. సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వృద్ధ మహిళలను ఆటోలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబానికి భారమయ్యామని వృద్ధులు వాపోయారు.