ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆహారపు అలవాట్లతో.. ఆ కుటుంబాల దరి చేరని కరోనా! - ఆత్మకూరు కరోనా కేసులు

దేశమంతా కరోనా ధాటికి అల్లాడుతుంటే వారికి మాత్రం కరోనా అంటే ఏంటో తెలియదు. రోడ్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోన్న వారిలో ఏ ఒక్కరూ మహమ్మారి బారిన పడలేదు. వారు అనుసరిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్లే కొవిడ్ దరి చేరలేదని చెబుతున్నారు.

no corona in athmakuru
no corona in athmakuru

By

Published : Jun 11, 2021, 4:51 PM IST

కరోనాతో దేశమంతా అల్లాడుతుంటే..కరోనా అంటే ఏమిటో తెలియని వారు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని.. దాదాపు 10 నక్కలోళ్ల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా రోడ్లపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. వీరి వద్దకు ప్రతి రోజూ వందలాది మంది ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ కరోనా మొదటి, రెండో దశల్లో కూడా.. వీరిలో ఏ ఒక్కరూ కరోనా బారిన పడలేదు. వ్యాపారం చేసేటప్పుడు మాత్రమే మాస్కు ధరిస్తారు. మిగిలిన సమయాల్లో మాస్కు పెట్టుకోకున్నా.. అందరూ ఒకేచోట గుంపులుగా చేరుతారు. తమ ఆహారపు అలవాట్లు, జీవన విధానాల వల్లే.. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. కరోనా సోకలేదని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details