లాక్డౌన్ కారణంగా నెల్లూరులో ఆహారం లభించని పేదలకు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువకులు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు అందిస్తున్నారు. సొంత డబ్బుతో పేదల ఆకలి తీరుస్తున్నారు. 2012 నుంచి జిల్లాలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటున్న నేస్తం ఫౌండేషన్ సభ్యులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి.
అభాగ్యులకు 'నేస్తం'... అన్నార్తులకు ఆపన్నహస్తం - కరోనా లాక్డౌన్
లాక్డౌన్ నేపథ్యంలో ఎంతోమంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఉపాధి లేకపోవటంతో కడుపు నింపుకునేందుకు కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి సాయం అందిస్తున్నారు నెల్లూరుకు చెందిన యువకులు. పట్టణంలోని మురికివాడల్లో అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.
nestham