ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Harrasment: స్నేహితుడి కోరిక తీర్చమంటూ యువతిపై దాడి.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ - Nellore Police Arrested Two Men For Assaulting Woman

తన స్నేహితుడి కోరిక తీర్చమంటూ.. ఇష్టమొచ్చినట్టుగా కర్రతో కొడుతూ ఓ యువతిని హింసించాడో యువకుడు. అంతటితో ఆగకుండా ఆ ఘనకార్యాన్ని తన మిత్రుడితో కలిసి వీడియో తీయించి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు.

Nellore Police Arrested Two Men For Assaulting Woman
స్నేహితుడి కోరిక తీర్చమంటూ యువతిపై దాడి

By

Published : Sep 15, 2021, 6:49 PM IST

స్నేహితుడి కోరిక తీర్చమంటూ యువతిపై దాడి

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. నగర సమీపంలోని రామకోటయ్య నగర్ నిర్జన ప్రాంతంలో ఓ యువతిపై.. ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా కొడుతున్న దృశ్యాలను తన స్నేహితుడితో వీడియో తీయించాడు. ఓ వైపు ఇష్టమొచ్చినట్లుగా కొడుతూనే.. మరోవైపు తన స్నేహితుడి కోరిక తీర్చాలంటూ బెదిరించాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ సంఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యువతి ప్రాధేయపడుతున్నా వినకుండా కర్రతో పదే పదే దాడి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆపై ఆమెను కొడుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టి వైరల్ చేశాడు. విషయం గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

పోలీసుల అదుపులో నిందితులు

నెల్లూరులో ఓ యువతిపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులను.. గంటల వ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని రామకోటయ్య నగర్​కు చెందిన వెంకటేష్​కు.. ఓ యువతితో స్నేహముంది. వెంకటేష్ ప్రవర్తన నచ్చక అతనికి దూరంగా ఉంటోంది. దీంతో అనుమానం పెంచుకున్న వెంకటేష్.. ఆ యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి.. కర్రతో కిరాతకంగా దాడి చేశాడు. అంతేకాకుండా.. దాడి చేస్తున్న దృశ్యాలను తన స్నేహితుడు శివకుమార్​తో వీడియో తీయించి.. అతని కోరిక తీర్చాలంటూ హింసించాడు. ఈ దృశ్యాలు తాజాగా మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. దీంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు.. రౌడీషీట్లు తెరుస్తామని ప్రకటించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

యువతిని హింసించిన కేసులో.. నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్నాం. నిందతులపై వివిధ కేసులు నమోదు చేశాం. మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. -విజయరావు, నెల్లూరు ఎస్పీ

ఇదీ చదవండి:

JAGAN BAIL: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details