ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నగరవనం'లోకి ప్రవేశం లేదా? - మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలు - నెల్లూరు తాజా వార్తలు

Nellore Nagaravanam Re- Opening : ఆ పార్కు ప్రజల కోసమే. కానీ, నాలుగున్నరేళ్లుగా గేట్లు తెరుచుకోలేదు. హరితాంధ్ర నినాదంతో టీడీపీ ప్రభుత్వం నెల్లూరులో నగరవనం పార్కును ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోక వచ్చాక నగరవనం పార్కును అభివృద్ధి చేస్తున్నామంటూ పర్యాటకులను లోపలికి అనుమతించటంలేదు. అధికారికంగా ఇప్పటికే రెండు సార్లు పార్కు తెరుస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

nellore_nagaravanam_re_opening
nellore_nagaravanam_re_opening

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 3:38 PM IST

Nellore Nagaravanam Re- Opening : తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తే అధికార ప్రభుత్వం వాటిని మూసేస్తోంది. నెల్లూరు నగరవనం పార్కుకు 2015 జూలైలో మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. పొదలకూరు రోడ్డులో 200ఎకరాల్లో నాలుగుకోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేశారు ఈ నగర వనాన్ని. అటవీ శాఖ అధ్వర్యంలో నగరవనం పార్కును 2019లో ప్రారంభించి పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ రావటంతోనే టీడీపీ హయాంలో అభివృద్ధి చేసిన నగరవనానికి తాళాలు వేశారు.

120 పట్టణాల్లో నగర వనాలు: మంత్రి పెద్దిరెడ్డి

Nagaravanam Development in Nellore District : పార్కును మరింత అభివృద్ధి చేస్తున్నామంటూ పూర్తిగా మూతవేశారు. ఇటీవల ప్రభుత్వం కొంత నిధులు కేటాయించడంతో మొక్కలకు నీళ్లుపోయటం, నగరవనంలో కొన్ని వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ వనాన్ని 2021, 2022లో ప్రారంభిస్తామని అధికారులు ప్రకటనలు చేసినప్పటికీ నేటికి నగరవనం గేట్లు తెరుచుకోలేదు. త్వరితగతిన పనులు పూర్తిచేసి పార్కులోకి అనుమతించాలని నగరవాసులు కోరుతున్నారు.

డోన్‌ సమీపంలో నగరవనం.. వేగంగా పనులు!

'నగరవనం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రెండు నెలలుగా అటవీ శాఖ అధికారులు నగరవనంలో మళ్లీ పనులు ప్రారంభించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి . మరికొన్ని అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ నెల 27న పర్యాటకులను అనుమతి ఇస్తాం. బృందావన్​ ఎకో పార్క్​, లోటస్​ పాండ్​ వంటి వినూత్న నిర్మాణాలు చేస్తున్నాం. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలతో నగరవనం నిర్మితమవుతోంది. యువత కోసం ట్రెక్కింగ్​, యోగా వంటి వివిధ రకాల సదుపాయాలు ఏర్పాటు చేశాం.' - అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్

'తవ్వి వదిలేశారు' నిధుల కొరతతో నిలిచిన రోడ్ల మరమ్మతు - నిత్యం నరకం చూస్తున్న ప్రయాణికులు

People Fires On YCP Government Nandanavanam Opening :అధికార పార్టీ హయాంలో పర్యటకులకు అనుమతి ఇచ్చిన తరువాత అభివృద్ధి పేరుతో వైసీపీ ప్రభుత్వం నెల్లూరు నగరవనాన్ని తెరవకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లతరబడి మూసి ఉంచడం పై పలువురు విమర్శలు చేస్తున్నారు.

అగ్నిప్రమాదం... అటవీశాఖ మొక్కలు దగ్ధం

Nagaravanam In Telugu : ఇప్పటికే రెండు మార్లు నగర వనాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. కానీ, అవి చేతలకు నోచుకోని నీటిపై రాతలుగా మిగిలిపోయాయి. ఈ నెలాఖరుకి పనులు పూర్తిచేసి పర్యాటకులకు అనుమతి ఇస్తామని మూడోసారి అధికారులు ప్రకటించారు. మూడోసారైనా నగరవనం పార్కులోకి పర్యాటకులను అనుమతిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details