నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జర్నలిస్ట్ అంజద్ బాషాపై వైకాపా నేతల దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వైకాపా నేతల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛని హరించే విధంగా జగన్ రెడ్డి జీవో 2430 తీసుకొస్తే... వైకాపా నేతలు పాత్రికేయులే ఉండకూడదంటూ విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
' ప్రశ్నించే పాత్రికేయులు ఉండకూడదని దాడులు చేస్తున్నారు' - nara lokesh latest news
రాష్ట్రంలో పాత్రికేయులే ఉండకూడదని వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ ఆరోపించారు. నెల్లూరులో జర్నలిస్ట్ అంజద్ బాషాపై వైకాపా నేతల దాడిని లోకేశ్ ఖండించారు.
'వైకాపా నేతలు పాత్రికేయులే ఉండకూడదని దాడులు చేస్తున్నారు'