నెల్లూరు జిల్లాలోని నక్క గోపాల్‌నగర్ వాసులు.. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న తమపై కొందరు దౌర్జన్యం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్లుగా.. రియల్టర్ల నుంచి ఇబ్బందులు పడుతున్నా.. తమవైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బుతో గుడిసెలు వేసుకుంటే.. వాటిని కూల్చేస్తున్నారని వాపోయారు. రౌడీలతో తమపై దాడి చేయించటమే కాకుండా.. తమకు మద్దతుగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఆశిక్ ను హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని.. బాధితులు జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కాళ్లపై పడి వేడుకున్నారు.