ఎండలతో అల్లాడుతున్న నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు నేలవాలాయి. విద్యుత్ స్తంభాలు కిందపడిపోయాయి. ఆదివారం కురిసిన వానతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. పంటలకు మేలు చేస్తుందని తెలిపారు. వాతావరణం కూడా చల్లబడింది.
నాయుడుపేట పరిసరాల్లో భారీవర్షం - nellore
నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
నాయుడుపేట