నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్లో రెండో దశ పంచాయితీ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని.. పలకరిస్తూ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ఆకర్షించాడు ఓ కుర్రాడు. సంగం మండలంలో పెద్ద పంచాయతీ సంగం గ్రామం. 8 వేలకుపైగా ఓటర్లు ఉన్న ఈ పంచాయతీలో మూడో వార్డుకు పోటీ చేసి గెలిచాడు ఆమటి శ్రీనివాసమహన్ తేజ. 350 ఓట్లున్న ఈ వార్డులో.. ప్రతివారిని పలకరిస్తూ కలుపుకుంటూపోతుంటాడు.
పాఠాలు చెబుతూనే పోటీ చేశాడు..ఎన్నికల్లో గెలిచాడు
యువత రాజకీయాల్లోకి రావాలని పార్టీలన్నీ పిలుపునిస్తుంటాయి. అయితే వాస్తవానికి ఆ అవకాశాలు చాలా తక్కువేనని చెప్పాలి. కానీ పోటీ చేయాలనే తపన.. ఊరిని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో సంగం గ్రామంలో వార్డు మెంబర్గా బరిలో నిలిచాడు ఎంటెక్ చదివిన యువకుడు తేజ. పదవి ప్రధానం కాదు.. పని చేయాలనే ఆలోచన ముఖ్యమంటూ.. అందరినీ కలుపుకుంటూపోతున్న శ్రీనివాసమహన్ తేజను ఆ వార్డు ప్రజలంతా కలిసి గెలిపించుకున్నారు.
ఎంటెక్ చదివి పంచాయతీ బరిలో నిలిచి
ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవలే ఎంటెక్ పూర్తి చేశాడు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా అదే కళాశాలలోనే ఉద్యోగం చేస్తున్నాడు. తన ఊరుకు సేవ చేయాలనే తపనతో పోటీ చేస్తున్నానని అంటున్నాడు ఈ యువకుడు. ఎంత పెద్ద పదవి అనేది ముఖ్యం కాదని.. తన వార్డును చక్కగా, సుందరంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని తేజ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఇవీ చూడండి...