ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొరికింది కొంత... దొరకాల్సింది ఎంతో

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో గతంలో తహశిల్దారుగా పనిచేసిన కృష్ణారావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తహసిల్దారుకు సహకరించిన ఆర్​వీ రవికుమార్​ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. మర్రిపాడు మండలంలో పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అడ్డగోలుగా నమోదు చేసి దొరికిపోయారు.  దొరికింది ఒకటైతే దొరకనివి మరెన్నో ఉన్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

దొరికింది కొంత... దొరకాల్సింది ఎంతో

By

Published : Jun 8, 2019, 9:33 AM IST


సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణంలో మర్రిపాడు మండలంలోని భూములకు విపరీతంగా గిరాకీ పెరిగింది .ఈ తరుణంలో మండల పరిధిలోని పడమటినాయుడుపల్లి,ఇర్లపాడు రెవెన్యూ పరిధిలో కొంతమంది గుత్తేదారులకు గుట్టు చప్పుడు కాకుండా 133 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అడంగల్లో నమోదు చేశారు .అంతేకాక 1.14 ఎకరాల్లో ఉప్పుటేరు వాగును అడంగల్లో ఎక్కించారు .
దీంతో గ్రామంలోని కొంతమంది నాయకులు అప్పట్లో అధికారులకు తెలియజేశారు . అప్పటికే తహశీల్దారు కృష్ణారావు మర్రిపాడు నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు . మర్రిపాడులో పనిచేస్తున్న ఆయన వింజమూరులో నివాసం ఉంటూ సొంత ఇంటికి ప్రైవేట్ వ్యక్తులను పిలిపించి లావాదేవీలు జరిపించినట్టు సమాచారం . ఆ కాల వ్యవధిలో పనిచేస్తున్న ఆర్ ఐ రవికుమార్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు . మిగతా వాటిపైనా విచారణ జరిపిస్తే మరిన్ని భూ భాగోతాలు వెలుగులో కొస్తాయని మండల ప్రజలు తెలుపుతున్నారు .

దొరికింది కొంత... దొరకాల్సింది ఎంతో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details