irregularities in eggs of Mid day meal: విద్యార్థులకు వడ్డించే కోడిగుడ్లను నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో కాకులు ఎత్తుకుపోయాయి. మధ్యాహ్న భోజన కార్మికురాలు చెప్పిన ఈ సమాధానంతో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖంగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం వేగూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు.
కోడి గుడ్లు కాకులు ఎత్తుకుపోయాయంట..! ఎక్కడో తెలుసా..?
Mid day meal: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు భోజన కార్మికురాలు చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నారు. 150 మంది విద్యార్థులుంటే 115 గుడ్లే ఉడకబెట్టడం ఎమిటని, మిగతా 35 గుడ్లు ఏమయ్యాయని అడిగితే కాకులు ఎత్తుకుపోయాయాని సమాధానం చెప్పింది.
భోజన నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థుల సంఖ్య కన్నా కోడిగుడ్లు తక్కువగా ఉండటంతో మధ్యాహ్న భోజన కార్మికురాలిని ప్రశ్నించారు. 150 మంది విద్యార్థులుంటే 115 గుడ్లే ఉడకబెట్టడం ఎమిటని, మిగతా 35 గుడ్లు ఏమయ్యాయని నిలదీశారు. కోడిగుడ్లు పాడైపోవడంతో పడేశానని, వాటిని కాకి ఎత్తుకుపోయిందని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యా కమిటీ సభ్యులను మందలించి, వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఇవీ చదవండి