ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేను ఉండే వేదికపై మీరొద్దు.. సబ్​ కలెక్టర్​తో ఆనం సంవాదం.. - ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజా వార్తలు

ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు సబ్‌ కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ మధ్య వాదులాట జరిగింది. ఎమ్మెల్యేను స్టేజిపైకి రావాలని సబ్​ కలెక్టర్ కోరగా..' మీరు వేదికపై ఉంటే నేను రాను. నేను వస్తే మీరు అక్కడ ఉండడానికి వీల్లేదంటూ' కరాఖండిగా చెప్పారు. సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ సభను కొనసాగించాల్సిందిగా అధికారులకు సూచించి వెళ్లిపోయారు.

mla aanam
mla aanam

By

Published : Dec 26, 2020, 12:19 PM IST

Updated : Dec 26, 2020, 2:12 PM IST

నేను ఉండే వేదికపై మీరొద్దు... సబ్​ కలెక్టర్​ గోపాలకృష్ణతో ఆనం సంవాదం...

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు సబ్‌ కలెక్టర్‌ రోణంకి గోపాలకృష్ణ మధ్య సంవాదం నడిచింది. సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే రామనారాయణరెడ్డిని సబ్‌ కలెక్టర్‌ వేదికపైకి ఆహ్వానించారు. ఆనం స్పందిస్తూ.. ‘కలెక్టర్‌ ఆదేశాల మేరకు మీరు మీ సభ నిర్వహించుకోండి. నేనూ, మా నాయకులు కిందనే ఉంటాం. మాకు అవమానమేం కాదు. మీరు వెళ్లాక రాత్రి ఎనిమిదింటి దాకా కార్యక్రమం జరుపుకుంటామ’ని అన్నారు.

సబ్‌ కలెక్టర్‌ మరోసారి వేదికపైకి రావాలని కోరారు. మళ్లీ స్పందించిన ఎమ్మెల్యే ‘నా కార్యక్రమం నా చేతుల మీదుగా జరగాలి. మీరు ప్రభుత్వ అధికారిగా ప్రజలకు సీఎం సందేశాన్ని వినిపించి వెళ్లండి. మీరు వేదికపై ఉంటే నేను రాను. నేను వస్తే మీరు అక్కడ ఉండడానికి వీల్లేదంటూ కరాఖండిగా చెప్పారు. సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ సభను కొనసాగించాల్సిందిగా అధికారులకు సూచించి వెళ్లిపోయారు.

ఇటీవల వెంకటగిరిలో జాతర నిర్వహణకు సబ్‌ కలెక్టర్‌ కొవిడ్‌ ఆంక్షలతో అనుమతించకపోవడంతో తొలుత ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. డెక్కలి మండలంలోని ఓ ట్రస్టు కార్యకలాపాలు, అంగన్‌వాడీ పోస్టుల భర్తీలోనూ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపిన దరిమిలా తాజా సంవాదం చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి:విశాఖలో టెన్షన్​... ప్రమాణానికి సిద్ధమైన తెదేపా, వైకాపా నేతలు

Last Updated : Dec 26, 2020, 2:12 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details