రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మెుదటిసారి నెల్లూరుకు వచ్చారు. అనంతరం మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ను ఆనం ఘనంగా సత్కరించారు. జిల్లా అభివృద్ధి గురించి ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.
ఆనం నివాసానికి మంత్రి అనిల్ కుమార్
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అనిల్ కుమార్ యాదవ్ సొంత జిల్లా నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డిని కలిసి జిల్లా అభివృద్ధి గురించి చర్చించారు.
ఆనం నివాసానికి మంత్రి అనిల్ కుమార్