నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని శెట్టిగుంటరోడ్డు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పచ్చదనం నుంచి పారిశుద్ధ్యం వరకు అన్ని రకాల పనులతో ప్రణాళిక రూపొందించి ఏడాదిన్నర కాలంలో నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు. పంట కాలువలను ఆధునీకరించి కాలువగట్ల పక్కన నివసించేవారికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామన్నారు. జనవరిలో నెల్లూరుకు ప్రత్యేకంగా ఓ టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయిస్తామని.. ప్రభుత్వ పథకాల మంజూరు కోసం ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే ఈ నెంబర్కు ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు.
'నెల్లూరుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయిస్తాం'
నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పచ్చదనం నుంచి పారిశుద్ధ్యం వరకు అన్ని రకాల పనులతో ప్రణాళిక రూపొందించి ఏడాదిన్నర కాలంలో నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని స్పష్టంచేశారు.
మంత్రి అనిల్ కుమార్