ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా మాస్కులు అందజేత - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు అందజేసింది ఓ సేవా సంస్థ. సచివాలయ ఉద్యోగులకు, అగ్నిమాపక, వైద్య సిబ్బంది సహా మీడియా వర్గాలకు వీటిని అందజేశారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ ఉద్యోగులకు స్థానిక సేవా సంస్థ కేఆర్పీఆర్ అధినేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రజాసేవలో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులకు ఆయన వీటిని అందజేశారు. మండల పరిషత్ కార్యాలయాల్లోని ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది, మీడియా వర్గాలకు వీటిని ఇచ్చారు. అందరికీ వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే చర్యలు నిర్వహించారు. నియోజకవర్గంలోని రాపూరు, డక్కిలి, బాలాయపల్లి మండలాల్లో కూడా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన ఈటీవీ భారత్కు వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా కోసమని ఆ మందు కొనడం ఇక చట్టవిరుద్ధం