శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరులోని వ్యాపార కూడళ్లు రద్దీగా మారాయి. కరోనా ప్రభావం ఉన్నా తెల్లవారుజాము నుంచే ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. పూజాపత్రి, కొబ్బరికాయలు తదితర పూజా సామగ్రి కొనుగోలు చేశారు. అయితే భౌతిక దూరం, మాస్కుల వంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. నగరంలోని స్టోన్ హౌస్ పేట, ఆత్మకూరు బస్టాండ్, సుబ్బారెడ్డి మార్కెట్ ప్రాంతాల్లో జనం కిక్కిరిసారు. వాహనాల రాకపోకలతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. నగరంలోని రాజరాజేశ్వరీ, ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలకు ఏర్పాట్లు చేశారు.
వరలక్ష్మి వ్రతం... రద్దీగా మారిన వ్యాపార కూడళ్లు - నెల్లూరులో మార్కెట్ల రద్దీ
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరులోని వ్యాపార కూడళ్లు రద్దీగా మారాయి. పూజా సామగ్రి కొనేందుకు జనం గుమిగూడారు. కరోనా ప్రభావం ఉన్నా భౌతిక దూరం, మాస్కులు వంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు.
రద్దీగా మారిన వ్యాపార కూడళ్లు