ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2022, 11:22 AM IST

Updated : Dec 9, 2022, 9:37 PM IST

ETV Bharat / state

బలహీనపడిన మాండౌస్​ తుపాను.. ఉదయం వరకు తీరం దాటే అవకాశం

mandous live updates
mandous live updates

21:32 December 09

బలహీనపడ్డ తుపాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుపాను మాండూస్ తుపానుగా బలహీనపడింది. ప్రస్తుతానికి తమిళనాడులోని మహాబలిపురానికి 90 కి.మీ., చెన్నైకి 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 14కి.మీ వేగంతో కదులుతుందనీ స్పష్టం చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాములోపు మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండి అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి , రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాను గాలుల కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. తుపాను తీరం దాటినప్పటికి రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు ఇచ్చింది. తుపాన్ కదలికలను స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సహాయ చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరు-2 మొత్తం 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని ప్రభుత్వం తెలిపింది.

19:16 December 09

పూర్తి స్థాయి నీటి నిల్వతో సోమశిల జలాశయం

  • నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం
  • సోమశిల జలాశయంలో 70 టీఎంసీలు దాటిన నీటి నిల్వ
  • ముందుజాగ్రత్తగా పెన్నా ద్వారా 20 వేల క్యూసెక్కులు విడుదల
  • అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌
  • సంగం, చేజర్ల, కలువాయి అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌

19:15 December 09

తుపాను ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు

  • రెండ్రోజులు భారీ వర్షాల వల్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు
  • అన్నమయ్య జిల్లాలో కమాండ్ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు
  • అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్‌రూమ్ 08561 -293006
  • రాయచోటి డివిజన్ కంట్రోల్‌రూమ్ 970110 11669, 94404 07003
  • రాజంపేట డివిజన్ కంట్రోల్‌రూమ్ నెంబర్‌ 87123 49929
  • మదనపల్లె డివిజన్ కంట్రోల్‌రూమ్ నెంబర్‌ 98499 04116
  • సమస్యలు వస్తే వెంటనే కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించిన కలెక్టర్​

19:14 December 09

వైఎస్‌ఆర్‌ జిల్లాలో మాండౌస్‌ తుపాను ముందు జాగ్రత్త చర్యలు

  • కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందులలో కంట్రోల్ రూమ్‌లు
  • కడప కలెక్టరేట్‌ కంట్రోల్‌రూమ్ నెంబర్‌ 08562 - 246344
  • కడప రెవెన్యూ డివిజన్ కంట్రోల్‌రూమ్ 08562 - 295990
  • జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్‌రూమ్ 94407 67485
  • బద్వేలు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్‌ 91821 60052
  • పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 73961 67368
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
  • కడపలోని నదులు, కాలువలు, చెరువుల వద్ద పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశం

19:11 December 09

నెల్లూరు మైపాడు బీచ్​లో ముందుకు వచ్చిన సముద్రం

  • నెల్లూరులో మైపాడు తీరంలో ఎగసిపడుతున్న అలలు
  • మైపాడులో 50 మీటర్లకు పైగా ముందుకొచ్చిన సముద్రం
  • తుపాను ప్రభావం వల్ల పెరుగుతున్న గాలుల తీవ్రత
  • మైపాడు బీచ్‌కు పర్యాటకులు రాకుండా పోలీసుల చర్యలు

15:15 December 09

అర్ధరాత్రి తర్వాత మహాబలిపురం-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం

  • తమిళనాడు తీరంవైపు వేగంగా కదులుతున్న తుపాను మాండౌస్‌
  • ప్రస్తుతం మహాబలిపురానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • గడచిన ఆరు గంటలుగా 12 కి.మీ. వేగంతో తీరంవైపు వస్తున్న తుపాను
  • అర్ధరాత్రి తర్వాత మహాబలిపురం-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం
  • ఉత్తర తమిళనాడు-దక్షిణకోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం
  • స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు విపత్తు సంస్థ ఆదేశాలు
  • ముందుజాగ్రత్తగా తీరప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించిన అధికారులు
  • పడవలు, వేట సామగ్రి జాగ్రత్త చేసుకోవాలని మత్స్యకారులకు సూచన
  • ప్రస్తుతం తీరం వెంబడి 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు
  • తుపాను తీర దాటేటప్పుడు 85 కి.మీ. వేగానికి చేరనున్న గాలుల వేగం

14:51 December 09

బాపట్లలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

  • తుపాను దృష్ట్యా బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • బాపట్లలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్ విజయకృష్ణన్
  • అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలి: కలెక్టర్‌
  • బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెం.8712655881: కలెక్టర్‌

13:48 December 09

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు: కలెక్టర్‌ చక్రధర్‌బాబు

  • మాండౌస్‌ తుపాను దృష్ట్యా నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తం
  • ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు: కలెక్టర్‌ చక్రధర్‌బాబు
  • రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయంతో విధులు: కలెక్టర్‌
  • ఇవాళ్టి నుంచి పాఠశాలలకు సెలవు: జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు
  • ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది: కలెక్టర్‌
  • ఇప్పటికే జిల్లాకు ఎస్డీఆర్‌ఎఫ్‌, 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చాయి: కలెక్టర్‌
  • లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్‌

12:19 December 09

రాత్రి 9 గంటలకు మహాబలిపురం వద్ద తీరం దాటనున్న తుపాను

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను మాండౌస్
  • తీవ్రతుపాను స్థాయి నుంచి స్వల్పంగా బలహీనపడిన మాండౌస్‌
  • తమిళనాడులోని కరైకల్‌కు 200 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • చెన్నైకి 270 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం
  • రాత్రి 9 గంటలకు మహాబలిపురం వద్ద తీరం దాటనున్న తుపాను
  • శ్రీహరికోట-పుదుచ్చేరి మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనున్న తుపాను
  • తీరం దాటే సమయంలో గంటకు 85 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
  • తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతం
  • దక్షిణ కోస్తాంధ్ర-రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
  • జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన విపత్తు నిర్వహణ సంస్థ
  • ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాల మోహరింపు

11:18 December 09

వైట్ కుప్పంలో 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

  • తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో చెదురుమదురు వర్షాలు
  • వాకాడు మం. వైట్ కుప్పంలో 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

11:18 December 09

నెల్లూరులో అప్రమత్తమైన అధికారులు

  • తుపాను దృష్ట్యా నెల్లూరులో అప్రమత్తమైన అధికారులు
  • నెల్లూరులో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కమిషనర్‌ హరిత
  • శని, ఆదివారాల్లో కూడా విధుల కొనసాగింపు: కమిషనర్ హరిత
  • యుద్ధప్రాతిపదికన సేవలకు సిద్ధంగా ఉండాలి: నెల్లూరు నగర కమిషనర్‌
  • కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు: కమిషనర్‌

11:17 December 09

తుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు

  • తుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు
  • తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • సూళ్లూరుపేట నియోజకవర్గం తడకుప్పంలో జాలర్ల తరలింపు
  • తీరప్రాంతంలో నివాసం ఉంటున్న జాలర్ల కుటుంబాల తరలింపు
  • జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసిన అధికారులు
  • తుపాను ప్రభావంతో రాత్రి నుంచి భారీగా వీస్తున్న ఈదురుగాలులు
  • బి.ఎన్.కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడులో ఈదురుగాలులు
  • తడ, సూళ్లూరుపేట మండలాల్లో ఈదురుగాలులు
  • తుపాను దృష్ట్యా చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికారులు అప్రమత్తం
  • చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు

11:17 December 09

తిరుమలలో వర్షం

  • తిరుమలలో వర్షం, భక్తుల ఇబ్బందులు
  • మాండౌస్‌ తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షం

11:16 December 09

పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర తుపాను

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతున్న మాండౌస్
  • గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్న తీవ్ర తుపాను
  • గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మాండౌస్ తీవ్ర తుపాను
  • జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • మరో 6 గంటలు తీవ్ర తుపానుగా తీవ్రతను కొనసాగించనున్న మాండౌస్‌
  • తర్వాత క్రమంగా బలహీనపడనున్న మాండౌస్‌ తుపాను
  • ఇవాళ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం
  • పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం
  • తీరం దాటే సమయంలో 65-85 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు
  • ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
  • మత్స్యకారులు వేటకు వెళ్లరాదు: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

11:16 December 09

జిల్లాల అధికారులకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు

  • తుపాను పట్ల జిల్లాల అధికారులకు విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు
  • తుపాను ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారుల అప్రమత్తం
  • సహాయచర్యల కోసం మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • ప్రకాశం 2, నెల్లూరు 3, తిరుపతి 2, చిత్తూరుకు 2 సహాయ బృందాలు

11:12 December 09

ప్రస్తుతం మహాబలిపురానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మాండౌస్
  • శ్రీలంకలోని జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 320కి.మీ. దూరంలో కేంద్రీకృతం
  • కారైకాల్‌కు 350 కి.మీ., చెన్నైకి 440 కి.మీ దూరంలో కేంద్రీకృతం
  • పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తున్న తుపాను
  • రేపు ఉదయం నుంచి క్రమంగా బలహీనపడనున్న తుపాను ఈ అర్ధరాత్రి మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం
  • తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
  • రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
  • రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు: ఐఎండీ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి: ఐఎండీ
Last Updated : Dec 9, 2022, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details