నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని టాటా మ్యాజిక్ వాహనం డీకొంది. ఈ ప్రమాదంలో వంట మాస్టర్ సయ్యద్ బాషాకు తీవ్రగాయాలు కాగ స్దానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అయితే వాహనం రావడానికి గంటన్నర సమయం పట్టింది. సంఘటన స్థలానికి వచ్చిన 108 సిబ్బంది అతనిని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సమయానికి 108 వాహనం వచ్చి ఉంటే అతను బతికేవాడని స్దానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మర్రిపాడు పోలీసులను అప్రమత్తం చేసి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆలస్యంగా వచ్చిన 108... ప్రాణం కోల్పోయిన బాధితుడు - ఆంబులెన్స్ లేట్‌గా కావడంతో వ్యక్తి మృతి తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో 108వాహనం ఆలస్యంగా రావడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వంట మాస్టర్ సయ్యద్ బాషాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 ఆంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అయితే వాహనం గంటన్నర ఆలస్యంగా రావడంతో అతను మృతి చెందాడు.
నెల్లూరు పాలెంలో రోడ్డు ప్రమాదం