ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Crime news: లాడ్జిలో ఆత్మహత్యాయత్నం.. బాలిక పరిస్థితి విషమం - lovers sucide attempt

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ లాడ్జిలో 17ఏళ్ల యువతి, 42ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బుచ్చిరెడ్డి పాలెంలో విషం తాగి ఇద్దరు ఆత్మహత్యయత్నం
బుచ్చిరెడ్డి పాలెంలో విషం తాగి ఇద్దరు ఆత్మహత్యయత్నం

By

Published : Aug 18, 2021, 12:51 PM IST

Updated : Aug 18, 2021, 3:27 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రేమ పేరుతో ఓ జంట ఆత్మహత్యకు యత్నించారు. పట్టణంలోని ఓ లాడ్జిలో 17ఏళ్ల యువతి, 42ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని గుర్తించిన లాడ్జి సిబ్బంది హాస్పిటల్​కు తరలించారు. దగదర్తి మండలం బాడుగులపాడుకు చెందిన రామయ్య అనే 42ఏళ్ల వ్యక్తి, జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన 17ఏళ్ల బాలికతో ప్రేమాయణం నడిపాడు. రామయ్యకు ఇదివరకే వివాహమై ఇద్దరు ఆడపిల్లలుండగా, మగ పిల్లాడి కోసం వరసకు మరదలయ్యే బాలికతో ఈ ప్రేమాయణం సాగించినట్లు తెలుస్తోంది.

మంగళవారం బాలికతో కలిసి బుచ్చిలోని లాడ్జికి వచ్చిన రామయ్య, తండ్రి, కూతురని చెప్పి గది అద్దెకు తీసుకున్నాడు. తమ ప్రేమకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఈ రోజు ఉదయం ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని లాడ్జి సిబ్బంది గుర్తించి, చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Aug 18, 2021, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details