ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2020, 3:08 PM IST

ETV Bharat / state

'కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపుతున్నారు'

కరోనా ప్రభావాన్ని ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని తెదేపా నేత కోటం రెడ్డి విమర్శించారు. ఈ వైరస్.. మామూలుగా వచ్చీపోయేదైతే లాక్ డౌన్ ఎందుకని ప్రశ్నించారు.

komata reddy
komata reddy

కరోనా మహమ్మారిపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని నెల్లూరు జిల్లా తెదేపా నేత .. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. ప్రపంచ దేశాలే కరోనా ధాటికి గడగడ లాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం చాలా తేలికగా తీసిపడేస్తున్నారని అన్నారు. కరోనా దానంతట అదే వచ్చి పోయేదైతే ఈ లాక్ డౌన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

అత్యవసరంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం, రాజధాని మార్చటం కోసమే ముఖ్యమంత్రి కరోనాను తక్కువ చేసి చెబుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం నేతలే కరోనాను పెంచుతున్నారని మంత్రి మోపిదేవి అనడం హాస్యాస్పదమని విమర్శించారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు 3 వేల రూపాయలు సహాయం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details