నెల్లూరు జిల్లా వేదాయపాలెం సెంటర్లో భాజపా సభ్యత్వ నమోదు కార్యాక్రమాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా అవినీతిరహిత అభివృద్ధి పాలన కేవలం భాజపా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లనే సాధ్యమని ఆయన ప్రసంగించారు. అటువంటి పార్టీలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కన్నా పిలుపునిచ్చారు.
'సీఎం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదు' - bjp registration meeting
ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
భాజపాలో సభ్యులు కండి