ప్రముఖ కవి, సాహిత్యవేత్త గుర్రం జాషువ శిష్యుడు విద్వాన్ కిరణశ్రీ. 1968-71 వరకూ గుంటూరులో జాషువ వద్ద ఉన్నారు. ఆయన చరమాంకంలో మూడేళ్లు సేవచేశారు. ఆప్పుడు కిరణశ్రీ వయస్సు 19ఏళ్లు. జాషువా ఆలోచనలకు ప్రభావితం అయ్యారు. తెలుగుపై అభిమానంతో ఉపాధ్యాయుడిగా మారారు. ఇప్పుడు జాషువా సాహిత్యాన్ని భవిష్యత్ తరలాకు అందించేందుకు నడుంకట్టారు.
జాషువా చదివారు
కిరణ శ్రీ ప్రకాశం జిల్లా గిద్దలూరు స్థానికుడు. ప్రముఖ కవి జాషువా వద్ద శిష్యరికం చేశాడు. ఆయన చరమాంకంలో సేవ చేశారు. జాషువా వద్ద ఉన్నప్పుడే...అనేక రచనలు చదివేవారు. ఆ సమయంలోనే సులబాంధ్ర వ్యాకరణం, మడివేలు మాచయ్య, కిరణ పంచవింసెటి పుస్తకాలు రచించి ఆయన అభినందనలు పొందారు. జాషువా మరణం తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. నెల్లూరులోని బేస్తవారిపేటలో పనిచేస్తూనే...మరియానీకు శుభం, ఛాఛాజీ, కమిలిన కమలం, పిచ్చివాడు లాంటి 12 పుస్తకాలను రచించారు.
పదిలో ఆయన పుస్తకాలే చదివింది
కిరణశ్రీ 1995లో ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠ్యపుస్తకాలను రచించారు. రాష్ట్రం విడిపోయే వరకు తరగతిగదిలో విద్యార్ధులు చదువుకునే తెలుసు పుస్తకాలు ఈయన రచించినవే. 2007లో గ్రేడ్ వన్ తెలుగు పండింట్గా పదవీ విరమణ చేశారు. 2014నుంచి బీసీ గురుకుల పాఠశాలలకు అకాడమిక్ గైడెన్స్ గా ప్రభుత్వం నియమించింది.
పింఛను సైతం
ఇంత చేస్తున్నా..తన గురువు పేరిట ఎదో చేయాలనుకున్నాడు. నెల్లురూలోని కస్తూర్భా కళాక్షేత్రంలో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంతో మూడేళ్లు పొట్లాడి...గ్రంథాలయ ఏర్పాటుకు భూమి సంపాదించారు. సొంతంగా 4 లక్షల ఖర్చుతో గుర్రం జాషువా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. కిరణ శ్రీకి వచ్చే పింఛనులో 15 వేల రూపాయలను ప్రతి నెలా గ్రంథాలయానికే ఖర్చు చేస్తున్నారు. కొంత మంది కిరణ శ్రీకి చేయూతనిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గుర్రం జాషువ సాహిత్యాన్ని ప్రచారం చేసేందుకు కవితాపీఠం పేరుతో కార్యవర్గం కూడా ఏర్పాటు అయ్యింది. ఇలా కవుల విగ్రహాలు ఏర్పాటు చేసేవారు, వారి జ్ఞాపకార్థం గ్రంథాలయాలు నిర్వహించే వారు మనకు అరుదుగా కనిపిస్తారు కదా!
జాషువాకు సేవ చేశాడు...సాహిత్యాన్ని కాపాడుతున్నాడు!