ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపాలో జగన్​కు కోవర్టులున్నారు: అచ్చెన్నాయుడు - Atchannaidu Comments on Jagan

భాజపాలో జగన్​కు కోవర్టులున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వారికి చంద్రబాబును తిట్టడమే పని అని అగ్రహం వ్యక్తం చేశారు. పుర ఎన్నికల్లో అడ్డదారుల్లో వైకాపా అభ్యర్థులు గెలిచారని ఘాటు విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

By

Published : Mar 31, 2021, 4:56 PM IST

అచ్చెన్నాయుడు

భారతీయ జనతా పార్టీలో సీఎం జగన్​కు కోవర్టులున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబును తిట్టడమే వారికున్న పని అని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. పనబాకకు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా అడ్డదారులు తొక్కి గెలిచిందని అచ్చెన్న ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details