నెల్లూరు జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు సరదాగా భయం లేకుండా గడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విసుగులేకుండా ఉండేందుకు చెస్, క్యారమ్ బోర్డు, ఇతర మరి కొన్ని ఆటలు ఏర్పాటు చేశారు. కరోనా భయం లేకుంటే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారని.. వైద్యాధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. కొవిడ్ కేంద్రాల్లో పౌష్టికాహారం, మందులు,అహ్లదకరమైన వాతావరణంలో బాధితులు ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
దీనితో పాటు ఎప్పటికప్పుడు బాధితులకు వైద్య సలహా ఇస్తున్నారు. జిల్లాలోని కొవిడ్ కేర్ నుంచి ఇప్పటివరకు 1500 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 1050 మంది కరోనా కేర్ సెంటర్లలో చికిత్స పొందుున్నారు.