నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనుల్లో భాగంగా 1060 ప్రభుత్వ పాఠశాల భవనాలను మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకు గాను జిల్లాకు 213 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పటివరకు జరిగిన పనులకు 96 కోట్ల రూపాయలు వరకు చెల్లించారు. అయితే మధ్యలో బిల్లులు రావడం ఆలస్యంకావడం.. పనులు కొన్ని రోజులు నిలిచిపోయాయి. మరోవారం రోజులు వర్షాల కారణంగా పనులు నిలిపేశారు. దీంతో పాఠశాలల తెరుచుకునే సమయానికి పనులు పూర్తి అవుతాయా లేదా అనే అనుమానాలు ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్ధులు వస్తారా...
పాఠశాలల్లో మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. తరగతి గదుల్లో దెబ్బతిన్న కిటీకీలు, ఆరుబైట బండపరుపు, విద్యుత్ పనులు వంటి ముఖ్యమైన పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇప్పటికే తొమ్మిది, పదితరగతులకు బోదన ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా... 10శాతం మంది విద్యార్ధులు కూడా హాజరు కావడంలేదు. జిల్లావ్యాప్తంగా 2.51 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యానభ్యసిస్తున్నారు. ఇలాంటి సమయంలో పాఠశాలలు తెరుచినప్పటికీ విద్యార్ధుల సంఖ్య పెరిగే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు.
తల్లిదండ్రులకు అవగాహన..