నెల్లూరు జిల్లా కావలి మండలంలోని కొత్తపల్లి చెరువులో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చెరువులో ఎర్రమట్టిని అడ్డూఅదుపూ లేకుండా తవ్వుకుపోతున్నారు. ఆదివారం పట్టపగలే జేసీబీతో తవ్వి ట్రాక్టర్లలో తరలించారు. స్థానికంగా జరుగుతున్న ఓ రహదారి పనుల నిమిత్తం ఈ తరలింపు చేపట్టారు. చెరువులో తవ్వకాలకు అనుమతి లేకున్నా, సీనరేజ్ మిగలడం సహా రవాణా వ్యయం వంటివి మిగులుతాయనే దురుద్దేశంతో చెరువులో కొందరు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ విషయంపై పలువురు రైతులు స్థానిక నీటి పారుదలశాఖ అధికార్లకు ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకోవడం లేదు. చెరువులో మట్టి తవ్వకాలు రెవెన్యూశాఖ పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. పంచాయతీరాజ్ అధికారులు మాత్రం చూస్తూ మిన్నకున్నారు.
తటాకంలో అక్రమ తవ్వకాలు...తెలియదంటున్న అధికారులు
నెల్లూరు జిల్లా కావలి మండలంలోని కొత్తపల్లి చెరువులో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చెరువులో ఎర్రమట్టిని అడ్డూ అదుపూ లేకుండా తవ్వుకుపోతున్నా....అధికారులు పట్టించుకోవటం లేదు.
కొత్తపల్లి చెరువులో మట్టి తవ్వుతున్న యంత్రం
కొత్తపల్లి చెరువులో మట్టి తవ్వకాల విషయం నా దృష్టికి రాలేదు. అలా తవ్వి తరలించడం తప్పిదమే. ఆ గ్రామ రెవెన్యూ అధికారిని పంపించి విచారణ చేయిస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. - రామకృష్ణ, తహసీల్దారు, కావలి