రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని ఉద్యాన శాఖకు 2019 సంవత్సరానికి గానూ 20 వ వార్షిక ప్రణాళిక విడుదల చేసింది. జిల్లాకు 16 కోట్ల 97లక్షల రూపాయలు విడుదల చేసింది. మామిడి, నిమ్మ పండ్ల తోటల విస్తరణ పథకం ద్వారా నిమ్మకు హెక్టారుకు 9400, మామిడికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నట్లు ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు ప్రదీప్ తెలిపారు. పండ్ల తోటలను పునరుద్ధరించేందుకు... మామిడికి హెక్టారుకు 17,500, నిమ్మకు 16 వేల రూపాయల రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. నీటి కుంటలకు 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. శాశ్వత పందిళ్లకు 50 శాతం రాయితీ, ప్యాక్ హౌసులకు 50 శాతం రాయితీ, కూరగాయలు పండించే రైతులకు విత్తనాలను రాయితీపై 50 శాతం అందజేసినట్లు తెలియజేశారు.
నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖకు 16 కోట్లు విడుదల
రాష్ట్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి గాను నెల్లూరు జిల్లాలోని ఉద్యాన శాఖకు 16 కోట్ల 97 లక్షల రూపాయలు విడుదల చేసింది.
నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖకు 16 కోట్లు