నెల్లూరు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో బొప్పాయి, మామిడి ,మిరప, నిమ్మ బత్తాయి, పంటలు బాగా దెబ్బతిన్నాయి.
అకాల వర్షంతో నేలకొరిగిన పంటలు
నెల్లూరు జిల్లాలో అకాల వర్షం రైతు కంట కన్నీరు మిగిల్చింది. ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పంటలు నేలరాలాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
బొప్పాయి 45 ఎకరాలు,మామిడి 71 ఎకరాలు, నిమ్మ 22 ఎకరాలు, బత్తాయి 40 ఎకరాలు, బయట ఆరబెట్టిన మిరప 650 క్వింటాళ్ల చొప్పున జిల్లాలో మొత్తం 188 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఉద్యాన అధికారులు అంచనా వేస్తున్నారు. 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని ఉద్యాన సహాయ సంచాలకులు ఖలీం భాష తెలిపారు. వేరుశనగ 110 ఎకరాలు, నువ్వులు 5 ఎకరాల్లో దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వాని నివేదిక పంపుతున్నట్లుతెలిపారు.
ఇదీ చదవండి:తెలంగాణకు వచ్చిన ప్రవాసాంధ్రుల్లో కరోనా లక్షణాలు!