ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరులో భారీ వర్షాలు... రాకపోకలకు అంతరాయం

నెల్లూరు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో అనేక శివారు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లు మునిగిపోవటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలు
నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలు

By

Published : Nov 12, 2020, 5:34 PM IST

నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో కాలనీలు మునకకు గురయ్యాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అనేక శివారు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లు మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షపు నీరు బైటకు పోయేందుకు కాలువలు లేక పోవడంతో కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, కోవూరు ప్రాంతాల్లోకి నీరు చేరింది.

ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలోకి ఐదారు అడుగులు నీరు చేరింది. బుజిబుజి నెల్లూరు, అర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, శ్రామికనగర్, రవీంద్రనగర్, ఉమారెడ్డి కుంట ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. నగరంలో పడిన నీరు బైటకు పోయే అవకాశం లేక.. కాలువలు పూడిపోవడం వంటి సమస్యలతో ఖాళీ స్థలాల్లోకి నీరు చేరి చెరువులను తలపిస్తుంది. నీరు బైటకు పోయే అవకాశం లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details